POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 3:53 pm Posted by : POLITICAL POWER

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

దహన సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేతపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 24 2026: పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి బండపల్లి గ్రామానికి చెందిన బాలకిష్టమ్మ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న మణిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాలకిష్టమ్మ పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. బాలకిష్టమ్మ మృతి పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి సాయం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోతుల రాంరెడ్డి, గర్రెమోని బాలరాజు, వెంకటయ్య, కోములయ్య, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, ఎం. రాములు, సింగం వెంకటయ్య, బోయిన్ కృష్ణ తదితరులు పాల్గొని బాలకిష్టమ్మకు నివాళులర్పించారు.