POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 5:56 pm Posted by : POLITICAL POWER

మెప్మా ఆర్పీలతో సమీక్ష సమావేశం

నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ ..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్: మున్సిపాలిటీలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో టిఎంసి, డిఇఓ, మరియు మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, కమిషనర్ ప్రభాకర్ మెప్మా కార్యకలాపాల పురోగతిని అదేవిధంగా అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, సరైన రికార్డులను నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని, అంతేకాకుండా కేటాయించిన అన్ని లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులకు కమీషనర్ సూచించారు. స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి) సభ్యులు మరియు ప్రజల ప్రయోజనం కోసం సకాలంలో నివేదికలు ఇవ్వడం, క్రమం తప్పని క్షేత్రస్థాయి పర్యవేక్షణ, సమస్యలను వెంటనే పరిష్కరించడంపై ఆర్పిలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కమీషనర్ తెలిపారు.