మేడిపల్లి కమల నగర్ కాలనీలో రోడ్డును ఆనుకొని అక్రమ షెడ్ నిర్మాణం* నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు
మేడిపల్లి: 08 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ మేడిపల్లి పరిధిలోని కమల నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆనుకొని వెలుస్తున్న అక్రమ షెడ్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, మున్సిపల్ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా అర్ధరాత్రి 11 గంటలకు ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ప్రధాన రహదారిని ఆనుకొని ఏకంగా రోడ్డు స్థలాన్ని సైతం ఆక్రమించి ఈ షెడ్ ను ఏర్పాటు చేస్తుండటంతో కాలనీవాసులు ఆందోళన...