మైలవరంలో ఎన్సీపీ మహిళా శక్తి ప్రదర్శన
మద్దిశెట్టి శామ్యూల్‌కు అండగా నిలిచిన మహిళా కార్యకర్తలు. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పొలిటికల్ పవర్, మైలవరం, సెప్టెంబర్ 10:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్సీపీ–ఎన్డీఏ మహాకూటమి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సమావేశం ఉత్సాహంగా సాగింది. 14 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేశారు. పార్టీకి, మద్దిశెట్టి శామ్యూల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి ఎన్సీపీ రాష్ట్ర మహిళా...