POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 11:48 am Posted by : POLITICAL POWER

మొక్కలు నాటి సంరక్షించుకోవాలి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని మండల అధికారి మోహన్ రాజ్ అన్నారు.గురువారం పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఖాళీ స్థలలో మొక్కలు నాటి సంరక్షించుకోవాలి సూచించారు. మొక్కలు నాటడంతో ప్రస్తుతం భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కార్యదర్శి సురేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మేకల రాములు యాదవ్, ఉపసర్పంచ్ కొమ్ము రవి సాగర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ రావు, ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు శివరాజు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు చెన్నమ్మ, బాలమణి, ఆశ కార్యకర్త లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.