పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 24 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామంలో మొదటి అంగన్వాడీ కేంద్రంలో బాల బాలికలకు గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థుల బాలబాలికలకు రోజువారీగా కేంద్రాలకు రావాలని అదేవిధంగా ప్రభుత్వాలు జారీ చేస్తున్న పౌష్టికాహారం మీరు అందుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్రాల్లో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్కు మరియు ఆయాకు సమయ వేళలో కేంద్రాలను తెరిచి ఉంచాలని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సకాలంలో ఇచ్చే ఫుడ్ ను అందించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి గర్భిణీ స్త్రీలు బాలబాలికలు పాల్గొనడం జరిగింది.