ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి పత్రం అందజేత
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వ్యాఖ్య

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఎ హరిబాబు జూన్ 27 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం కలకోడిమ గ్రామానికి చెందిన ఆదూరి విశ్రాంతకు వైద్య చికిత్స నిమిత్తం ఎల్ ఓ సీ మంజూరు పత్రాన్ని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. మోకాళ్లకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆదూరి విశ్రాంతకు హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందేందుకు రూ.3,00,000 విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యత అని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.