POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 5:01 pm Posted by : POLITICAL POWER

మోజర్లలో ఘనంగా సప్తాహ యాగ పూజలు

శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు

భజన బృందాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు సెప్టెంబర్ 5 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద సప్తాహ యాగ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో రెండు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భజన బృందాల ఆధ్వర్యంలో భక్తి గీతాలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను శోభాయమానంగా అలంకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులకు అన్నదానం

సప్తాహ యాగ పూజా కార్యక్రమాల్లో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం, రాత్రి అన్నదానం, ఆదివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

ఈ సప్తాహ యాగ పూజా కార్యక్రమాల్లో మోజర్ల గ్రామ ప్రజలతో పాటు గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. గ్రామ ప్రజలందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మోజర్ల గ్రామంలో భక్తి వాతావరణం నెలకొననుంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.