POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 1:24 pm Posted by : POLITICAL POWER

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15, 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం సమీపంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వినాయక విగ్రహ దాతలు ఆడేం చెన్నమ్మ, ఆడేం ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఆడేం రమేష్, ఆడేం సరిత తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మోజర్ల గ్రామ సర్పంచ్ కే. చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. రమేష్ యాదవ్, 2వ వార్డు సభ్యుడు ఎస్. కృష్ణయ్య తో పాటు వినాయక బృందం సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గణనాథుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.