ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు జాగ్రత్తలకు సూచనలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 12 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గురువారం సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి అనుమతులు, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. అలాగే గొర్రెల షెడ్లు, పశువుల షెడ్ల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులు, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు, గ్రామ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 125 రోజుల పని కల్పించే అంశంపై చర్చించారు. అర్హులైన వారికి కొత్త జాబ్ కార్డులు అందించే విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని గ్రామ అభివృద్ధికి పలు సూచనలు చేశారు.