POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 10:20 pm Posted by : POLITICAL POWER

*యమునా పుష్కరాల్లో వైఎస్సార్‌కు పిండప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే సత్తి*

పొలిటికల్ పవర్ జాతీయతెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి
అనపర్తి/ఉత్తరప్రదేశ్, జూన్ 04:

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న యమునా నది పుష్కరాల సందర్భంగా అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పితృకార్యాలు నిర్వహించారు. యమునా నది తీరంలో తన దివంగత తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ఆత్మశాంతి కోసం పిండప్రదానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ వేధింపులు, దాడులకు బలైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. వారి త్యాగాలు, సేవలను గుర్తు చేసుకుంటూ పిండప్రదానం చేశారు.

ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి పిండప్రదానం చేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానుభావుల సేవలను భావితరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

యమునా పుష్కరాల పవిత్ర వేళ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, భావోద్వేగం, ప్రజా సంక్షేమ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని పార్టీ నాయకులు తెలిపారు.