*యమునా పుష్కరాల్లో వైఎస్సార్‌కు పిండప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే సత్తి*
పొలిటికల్ పవర్ జాతీయతెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి అనపర్తి/ఉత్తరప్రదేశ్, జూన్ 04: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న యమునా నది పుష్కరాల సందర్భంగా అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పితృకార్యాలు నిర్వహించారు. యమునా నది తీరంలో తన దివంగత తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ఆత్మశాంతి కోసం పిండప్రదానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ వేధింపులు, దాడులకు బలైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. వారి త్యాగాలు, సేవలను...