
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్
గార్ల మండలం ప్రతి నిది :గార్లమండలంలో 50 సం,లు దాటిన గొర్రెలు, మేకల కాపరులకు ప్రతి నెల 5 వేల రూ,లు పెన్షన్ మంజూరుచేయాలని,చదువుకున్న గొర్ల కాపరులకు గొర్రెల ఫాం నిర్మించాలని గోర్రెల,మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర నాయకులుఇమ్మడి గోవింద్ డిమాండ్చేశారు.జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గోపాలపురం లో మంగళవారం సర్వే నిర్వహించారు. గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కాపరుల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు కాపరులకు ఏ మేరకు అందుతున్నాయో సర్వే ద్వారా తెలుసుకుంటున్నామన్నారుమేత కొరత, పశువైద్య సేవ లేమి,గొర్రెలు, మేకలకు బీమా సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలతో పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ సర్వేలో కాపుల సంఘం మండల కార్యదర్శి వడ్డెపూడి మల్లయ్య, సంఘ సభ్యులు ధనియాకుల మోహన్ రావు, జె.కొండల్ రావు, కె.కొండలరావు, పి. మహేష్, బి.బాబు, వై.ఉపేందర్,వై.నాగేశ్వరరావు, పి.రాజు తదితరులు ఉన్నారు.