కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి
పొలిటికల్ పవర్,దమ్మపేట, ఆగస్టు 24: అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో కీర్తిశేషులు, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు యార్లగడ్డ భాస్కరరావు సతీమణి యార్లగడ్డ కుమారి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం యార్లగడ్డ కుటుంబ సభ్యులను పరామర్శించిన సోయం వీరభద్రం వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు కూకలకుంట
సత్యనారాయణ, సీపీఐ నాయకులు తంగెళ్లమూడి శివ, బెజవాడ రాము, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు యార్లగడ్డ బాబు, బీఆర్‌ఎస్ యువ నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు