POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:20 pm Posted by : POLITICAL POWER

యువజన, విద్యార్థి విభాగాల సేవలు అభినందనీయం: సత్తి సూర్యనారాయణ రెడ్డి

  • పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 05:
    తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: వైయస్‌ఆర్‌సీపీ యువజన మరియు విద్యార్థి విభాగాల సేవలు అభినందనీయమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అనపర్తిలో కెనాల్ రోడ్‌లోని వైయస్‌ఆర్ విగ్రహం వద్ద యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు.
    ఈ కార్యక్రమానికి హాజరైన సత్తి సూర్యనారాయణ రెడ్డి మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీకి యువజన, విద్యార్థి విభాగాలు ముఖ్యమైనవని, సేవా భావం కలిగిన యువత ఈ విభాగాల్లో ఉంటే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని అభిప్రాయపడ్డారు.
    ఈ కార్యక్రమంలో సత్తి మణికంఠ రెడ్డి, సత్తి రామారెడ్డి, పి. నాగిరెడ్డి, ఓ నాగిరెడ్డి, రెడ్డి కృష్ణ, డి. శ్రీనివాస్ రెడ్డి, మణికుమార్, తేజ, యువతేజ, వినయ్, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), తిరగటి శివ, ఆర్కే, ఇమ్మంది విజయకుమారి, కొండేటి భీమేష్, ఏడుకొండలు, తుమ్మ సత్తిబాబు, బండారు శ్రీను, కర్రి దాసు, వీరయ్య కాపు, గుంటూరు శ్రీను, అజయ్, సత్తి గంగిరెడ్డి, కానూరి కృష్ణ, మాదాబత్తుల శంకర్ బాబు, ఇబ్రహీం, సత్తి శ్రీనివాసరెడ్డి (బుజ్జి), గోపి తదితరులు పాల్గొన్నారు.