యువజన, విద్యార్థి విభాగాల సేవలు అభినందనీయం: సత్తి సూర్యనారాయణ రెడ్డి
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 05: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: వైయస్‌ఆర్‌సీపీ యువజన మరియు విద్యార్థి విభాగాల సేవలు అభినందనీయమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అనపర్తిలో కెనాల్ రోడ్‌లోని వైయస్‌ఆర్ విగ్రహం వద్ద యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సత్తి సూర్యనారాయణ రెడ్డి మజ్జిగ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీకి యువజన, విద్యార్థి విభాగాలు ముఖ్యమైనవని, సేవా...