POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:17 pm Posted by : POLITICAL POWER

యూపీఐ లావాదేవీల పై పన్ను ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన

*యూపీఐ పన్ను ప్రజలపై కొత్త బాదుడే సిపిఐఎంల్ మాస్ లైన్*

జూలూరుపాడు సెప్టెంబర్ 18: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిన్ 9 తెలుగు న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీల పై విధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఉపసమరించుకోవాలని. డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఆధ్వర్యంలో జూలూరుపాడు బస్టాండ్ సెంటర్ లో నిరసన ర్యాలీ నిర్వహించి నిరసనగా 40 నిమిషాల పాటు ఆందోళన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి *జాటోతు కృష్ణ మాట్లాడుతూ*. దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్సిటీ చెల్లింపులు ఎప్పట్లాగానే సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో, కేంద్రం అమెరికా ప్రయోజనాల కోసమే పన్నును పద్ధతిని తీసుకొచ్చిందని వారు ఆరోపించారు.సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయంటూ వాణిజ్య లావాదేవీల సైతం అతిశల్ప పరిణామం మాత్రమే పన్ను విదిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదని వారు అన్నారు. వాణిజ్య సంస్థలు ఈ పన్ను పోటును వినియోగదారుల నుండే ముక్కు పిండి వసూలు చేస్తారన్న విషయం కేంద్రానికి తెలియదా అని వారు ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అన్ని రకాలుగా 30 వేల కోట్లకు పైగా దేశ ప్రజలపై భారం పడనుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత టాక్స్ చెల్లిస్తున్న ప్రజలు అది ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా ప్రభుత్వ ధనాన్ని ఆస్తులని కార్పొరేట్ శక్తులకు రకరకాల పేరిట అప్పజెప్తున్న వైనాన్ని మరవరాద ఈ సందర్భంగా అన్నారు. బ్రిటిష్ వాళ్లు ఇండియాకు టీ కాపీలను ఉచితంగా అలవాటు చేసి లక్షల కోట్ల వ్యాపారం నేడు చేస్తున్నట్లు అమెరికా యూపీఐ లావాదేవీల కంపెనీలు 10 ఏళ్లు ఉచితంగా సేవలు అందించి ప్రజలందరికీ అలవాటు అయిన తర్వాత ఈరోజు తొలిత వాణిజ్యానికి తర్వాత సామాన్యులపై ఈ పన్ను పోటు పెంచే ప్రమాదం ఉందని వారన్నారు. తక్షణమే ఆన్లైన్ లావాదేవీలపై కేంద్రం విధించిన పనులను ఎత్తివేసి మరింత సరళంగా ఆన్లైన్ చెల్లింపులు జరిగేటట్లు చూడాలని వారు కోరారు. ఇప్పటికే మోడీ పాలనలో అన్ని రకాల ధరలు ఆకాశానంటేయని అన్ని రకాల నిజ వేతనాలు పాతాళానికి పడిపోతున్న ఈ నేపథ్యంలో మరికొంత భారాన్ని వేయటమంటే ములీగ్ నక్కపై తాటిపండు పడ్డ చందమే నాని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే డిజిటల్ లావాదేవీల పై విధించిన పన్నును ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంజిల్లా నాయకుల ఎద్దుల పురం గోపాలరావు రాజశేఖర్ ఏఐయుకేఎస్.మండల కార్యదర్శి తోటకూరి నరేష బైరు వెంకన్న మండల నాయకులు రాయలసీదు భద్రు దీప్లా కుమార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.