– ప్రధాని మోడీ కృషి ఫలికంగా ఇక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది,
– కొత్తకోట వాకర్స్ క్లబ్స్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21. 2026.
యోగా అనేది కేవలం వ్యాయామం కాదు అది జీవన విధానం. శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే ఒక మహొన్నత సాధనం అని, మనం కేవలం ఒక శారీరక వ్యాయామ విధానాన్ని మాత్రమే జరుపుకోవడం కాదు, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానకిన ప్రశాంతక, ఆధ్యాత్మిక సమతులుతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయానికి గౌరవం తెలుపుతున్నామని, భారతదేశం ప్రపంచానికి అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని నేడు ప్రపంచ అంతా స్వీకరించడం మనకు గర్వకారణం అని ప్రముఖ యోగా గురూజీ మధుసూదన్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు పట్టణం లోని పలు సమూహాలు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ కలసి దాదాపు 300 మంది పాల్గొని ఘనంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురూజీ మధుసూదన్ విశిష్ట అతిధిగా పాల్గొనగా ముఖ్య వక్తగా ప్రఖ్యాత హోమియో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రవీంధర్ రెడ్డి , ముఖ్య అతిధిగా కొత్తకోట పట్టణానికి చెందిన యోగాలో నైపుణ్యం కలిగిన వెంకటేష్ యాదవ్ పాల్గొని యోగ విశిష్టతలను ఉపయోగాలు తెలుపుతూ పాల్గొన్న వారిచేతపలురకాలఆసనాలువేయించి,ప్రాణాయామము , ధ్యానం చేయించారు.ఈకార్యక్రమం లో వక్త డాక్టర్.రవీంధర్ రెడ్డిమాట్లాడుతూ దినచర్యలో భాగంగా తీసుకోవలసిన ఆహార నియమాలు గురుంచి క్లుప్తంగా వివరించారు.ప్రధాని మోడీ కృషి ఫలికంగా ఇక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది. నేరు యోగా దేశాల సరిహద్దులు, భాషలు, సంస్కృతులను దాటి ప్రపంచ మానవాళిని ఏకం చేసే శక్తిగా నిలిచిందన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తోంది. ఆధునిక జీవితంలోని సవాళ్లు ఒత్తిళ్లు, అసమతుల్యతల మధ్య యోగా మనకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల శక్తిని ప్రసాదించే మహత్తర సాధనం అని తెలిపారు. ఏ దేశానికైనా అసలైన బలం కేవలం దాని ఆర్థిక వ్యవస్థలో, సహజ వనరుల్లో లేదా సాంకేతిక పురోగతిలో ఉండదు. ఆ దేశపు సంస్కృతి, నాగరికత, విలువలలోనే దాని మైన శక్తి రాగి ఉంటుంది. ఒక సమాజం తన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడే భవిష్యత్తు వైపు అత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందన్నారు. ప్రపంచానికి శాంతి, మానవ సంక్షేమ మార్గాన్ని దూపీ భారతదేశ నిర్మాణానికి కలిసి కృషి చేద్దామన్నారు.అనంతరం యోగా గురువులు మాట్లాడుతూ యోగా కేవలం శరీరానికి సంబంధించినది కాదని మనసుకుసంబంధించినది అని మన యొక్క మానసిక వత్తిడుల కారణంగానే మనిషికి రకరకాలజబ్బులువస్తున్నాయనిజబ్బులు ఉన్నాయని శరీరానికిచేసేచికిత్సతాత్కాలికమైనది మాత్రమే నని, మన మనసును శుద్ధి చేస్తే జబ్బులు పూర్తిగా నశిస్తాయని అది కేవలం యోగా ద్వారానే సాధ్యమని మన యొక్క ఆహారపు అలవాట్లుమనఆలోచనవిధానముమార్చుకుంటేనే జబ్బులుదరిదాపులకుచేరవనివారుఅన్నారు.అనంతరం యోగ దినోత్సవంలో పాల్గొన్నవారికి ఆరోగ్యకరమైన అమృతాహారాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసి అందించారు .ఈకార్యక్రమంలో పట్టణ పోలీస్ వలయాధికారి రాంబాబు, ప్రముఖులు గుండ్రాతి వామన్ గౌడ్ , సంధ్య రవీంధర్ రెడ్డి,సుధా రామ్ మోహన్ రెడ్డి , సుభాష్ , కొమ్ము భరత్ భూషణ్ , మురళీధర్ రెడ్డి , గుబ్బ బలస్వామి, కార్యక్రమ నిర్వాహకులు దేవన్న , నాగరాజు, శేఖర్ గౌడ్ , పాండు రెడ్డీ , భీమ కిషోర్, శ్రీనివాస్ రెడ్డీ , స్టార్ అంజనేయలు, యాదయ్య , వినోద్ ,సాయిలు , రాఘవేంద్ర , నరేందర్ రెడ్డీ , కిషన్ నాయక్ , మీషేక్,యస్.ఈశ్వర్, సంజీవ రెడ్డీ , చిరంజీవి ,నరేష్ ,రామకృష్ణ , స్వాతిరాజు ,సాయి ,రవి , బాలు, శివ నారాయణ , రవేంధర్ రెడ్డి ,కొండ స్వప్న ,హిమబిందు , భవాని తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు .



