పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో: బాజ శేఖర్ జులై 27 2026: హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణకు సంబంధించిన పలు కేసులను విచారించిన తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అర్హత కలిగిన ప్రత్యామ్నాయ అధికారిని వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం, కోర్టు ధిక్కరణకు సంబంధించిన అంశాలను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హైడ్రా కమిషనర్‌గా కొనసాగడం సముచితం కాదని పేర్కొంటూ, పరిపాలనా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో హైడ్రా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.