POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:15 pm Posted by : POLITICAL POWER

రక్తదానంలో ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా జ్ఞాపికను అందజేసిన చీఫ్ విప్ తెలంగాణ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో అత్యధికంగా రక్తాన్ని సేకరించి, ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు దోహదపడినందుకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు గవర్నర్ చేతుల మీదుగా పురస్కార ప్రశంసా జ్ఞాపికను పత్రం అందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వనపర్తికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆ ప్రశంసా జ్ఞాపికను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్వీకరించారు.