రక్తదానం మహాదానం.. 28వ సారి రక్తదానం చేసిన నాగరాజును సన్మానించిన పలుస శంకర్ గౌడ్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 9 2026: రక్తదానం చేయడం అంటే ఒకరి ప్రాణాన్ని కాపాడినట్లేనని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం తన వద్ద చదువుకున్న విద్యార్థి నాగరాజు 28వ సారి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగరాజును అభినందిస్తూ రక్తదాన ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి...