POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 4:38 pm Posted by : POLITICAL POWER

రక్షా బంధన్ అంటే అన్నా చెల్లెళ్ల గొప్ప బంధాల వారధి

పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 28 2026: రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కు స్వగృహంలో వారి సోదరీమణులు సుజాత, సుమిత్ర, కవిత మరియు రాణి రాఖీ కట్టి ప్రేమానుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ… అన్నా చెల్లెళ్ల, అన్నదమ్ముల మధ్య అనుబంధానికి, ఆత్మీయతకు నిదర్శనంగా రాఖీ పండుగ జరుపుకుంటారని అన్నారు. అన్న తన చెల్లెలిని జీవితాంతం రక్షిస్తానని ఇచ్చే మాటే రక్షా బంధన్ అని పేర్కొన్నారు. ఈ రక్షా బంధన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గుండ్రతి వామన్ గౌడ్ సదానందం గౌడ్, ఉపాధ్యాయులు రఘువర్ధన్,శైలజ, హిమబిందు, రాకేష్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.