POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 10:57 pm Posted by : POLITICAL POWER

రసవత్తర రాజకీయం విజయన ‘గరం గరం’

రసవత్తరంగా విజయనగరం రాజకీయం…

బొత్స కుటుంబంలో కలహాలు పెట్టిన రెడ్డి కులానికి చెందిన ప్రముఖ నాయకుడు…

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

గత నాలుగేళ్లుగా కుటుంబంలో అంతర్గత విబేధాలు ఆజ్యం పోసిన ప్రముఖ రెడ్డి నాయకుడు…

చిన శ్రీను కాదు కాదు పెద్ద శ్రీను…

విజయనగరం జిల్లాలో గత 30 ఏళ్లుగా వందల సంవత్సరాల నుంచి విజయనగరం జిల్లా విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు, మొయిద రాజులు ఏక చక్రాధిపతిగా పరిపాలించిన చరిత్ర మనందరం విన్నది చదివినది… ఆలాంటి విజయనగరం జిల్లా పై బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం సాధారణ కుటుంబం నుండి వచ్చి బొత్స సత్యనారాయణ గారు 1991 నుండి రాజకీయాల్లో జిల్లాకు చెందిన వివిధ సంస్థానాల రాజులు ప్రాబల్యాన్ని తగ్గించుకొని రాజకీయంగా మెట్టు మెట్టు ఎదుగుతూ 2004 వచ్చేసరికి రాష్ట్ర మంత్రి అయినప్పటి నుండి జిల్లాకు చిన్న శ్రీను కాదు కాదు పెద్ద శ్రీను బొత్స వారసుడిగా పగ్గాలు తీసుకొని జిల్లాను వారు ఏ పార్టీలో ఉన్న వారి కుటుంబమే గాని వారి అనుచరులకు గాని వాళ్ళ అభిమానులు గాని ప్రజలను గాని ఎలాంటి సహాయ సహకారాలు కావాలనుకున్న పార్టీలతో సంబంధం లేకుండా ఇంటికి వెళ్ళగానే ఏం పని మీద వచ్చారు ఏం కావాలి ఎవరికి చెప్పాలి అనే క్వశ్చన్ తో ప్రారంభించే నాయకులలో చిన శ్రీను  ముందుండేవారు…

 

గత నాలుగు ఏళ్లుగా కుటుంబంలో జరిగిన కొన్ని బేధా అభిప్రాయాలు కారణంగా అంతర్యుద్ధం జరుగుతుందనేది నిజం దానికి ప్రధాన కారణం గత వైసిపి గవర్నమెంట్ లో ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా వచ్చిన ప్రముఖ రెడ్డి నాయకుడు కుటుంబ కలహాలను రాజకీయ కలహాలుగా తీర్చిదిద్ది కుటుంబాన్ని విడదీయడానికి చేసిన ప్రయత్నమే నేటి చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రధాన కారణం కావచ్చు?

 

నేడు జిల్లాలో ఉన్న ప్రజలు గాని వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని చిన్న శ్రీను  గురించి తెలిసి ఎందుకు వెళ్ళారు అనేది మెజారిటీ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు తెలుసు?

బొత్స  ఒక  రాజకీయ శిఖరం…

 

1992–1999 – విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (DCCB) చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. గొప్ప నాయకుడు అని ఫీల్ అవ్వలేదు…

1996 – బొబ్బిలి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమికి కృంగిపోలేదు.

1999 – బొబ్బిలి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ గెలిచిన కొద్దిమంది ఎంపీలలో ఆయన ఒకరు. దేశ నాయకుడు ఐపోయాను అని గర్వపడలేదు.

2004 – చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2009 – చీపురుపల్లి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఆయన పేరు కూడా రాజకీయ వర్గాల్లో వినిపించింది. ముఖ్యమంత్రి అవ్వలేదు అని బాధ పడలేదు.

2009–2014 – వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖలను నిర్వహించారు.

2011–2014 – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షుడిగా పనిచేశారు.

2014 – రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తన అనుచరుడు బెల్లాన చంద్రశేఖర్ తన మీదే పోటీ చేస్తే బాధపడలేదు చీపురుపల్లిలో ఓటమి పాలయ్యారు.

2015 – కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2019 – చీపురుపల్లి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ మంత్రివర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2022 – మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2024 – చీపురుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇదే ఎన్నికల్లో తన తమ్ముడు గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య పై అప్పటి ప్రధాన అనుచరుడిగా ఉన్న కొండపల్లి కొండల రావు గారు కుమారుడు నేటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్  పోటీ చేసిన బాధ పడలేదు. తన స్వయాన తమ్ముడు బొత్స లక్షణరావు గారు పార్టీ మారి జనసేనకు వెళ్ళిపోయిన బాధపడలేదు.

ఆగస్టు 2024 – విశాఖపట్నం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు…

రాజకీయలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరూ అనేది యదార్థం బొత్స కింద పడిపోయిన ప్రతిసారి ఎలా లేవాలో బొత్స కి తెలిసినట్టు బహుశా ఈ రాష్ట్రంలో ఇంకెవరికి రాజకీయ నాయకులకు తెలిసి ఉండదు..

నేడు చిన్న శ్రీను  పార్టీ మారిన హుందాగా స్పందించే వ్యక్తిత్వం బొత్స . తన కుటుంబ సభ్యులకు గానీ తన అనుచరులే గాని ఏ పార్టీకి వెళ్లిన ఎక్కడ ఉన్నా వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం బొత్స ది ..

కలిసి ఉంటే కలదు సుఖం… నేటి రాజకీయ క్రీడల్లో భార్యాభర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెలు బేధాలు లేని రాజకీయాల్లో నేటి రాజకీయాలు నేటి పార్టీలు అరితేరాయి అని చెప్పాలి.

చివరగా విజయనగరం జిల్లా నూతన తెలుగుదేశం పార్టీ రధసారధి చిన శ్రీను గారు కావచ్చు ….

ముదిలి రామోజీ