రాజకీయ సంచలనం: జైలు గోడలు తెంచిన ‘ప్రజాభిమానం’.. పెళ్లకూరు జడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ సత్యనారాయణ రెడ్డి విక్టరీ! కార్యకర్తల ధీమా – ప్రజల తీర్పు: కక్షసాధింపు రాజకీయాలకు ఓటుతోనే తిరుగులేని జవాబు!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* పెళ్లకూరు: రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు తాత్కాలికమే తప్ప... ప్రజల్లో సంపాదించుకున్న నమ్మకం, విశ్వాసం ముందు అవేవీ నిలబడవని పెళ్లకూరు జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. నెల్లూరు సెంట్రల్ జైలు నాలుగ్గోడల మధ్య బంధించినా, నియోజకవర్గ ప్రజల ఆదరణను ఏ శక్తీ అడ్డుకోలేకపోయిందని ఈ తీర్పు తేల్చిచెప్పింది. తిరుపతి జిల్లా పెళ్లకూరు జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కామిరెడ్డి...