–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13.2026.రాజీమార్గంద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వరన్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యంమని,3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617కేసులపరిష్కారంమనిజిల్లాప్రధానన్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావుఅన్నారు.శనివారంవనపర్తి పట్టణంలోనిజిల్లాప్రధానన్యాయస్థానంఆవరణంలోజిల్లాన్యాయసేవలవిభాగంఆధ్వర్యంలో3వ.జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. వనపర్తిజిల్లాప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ లోక్ అదాలత్‌లో వివిధ రకాలకేసులనురాజీమార్గంద్వారాపరిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూరాజీమార్గమేరాజమార్గం అని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులనుఇరుపక్షాలఅంగీకారంతోసత్వరమేపరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రాజీ పద్ధతిలో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతోపాటుఇరుపక్షాలకు త్వరితగతిన న్యాయం లభిస్తుందని అన్నారు.సత్వర న్యాయంఅందించడమేలోక్,అదాలత్,ప్రధానలక్ష్యమని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు.వనపర్తి లో 3వ జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 6,617కేసులురాజీఅయ్యాయని తెలిపారు.ఇందులో1,639క్రిమినల్,కేసులు,19.సివిల్ కేసులు,4,959ప్రీలిటిగేషన్,కేసులుపరిష్కారమయ్యాయి.లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడం వల్ల న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయమూర్తి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనితమకేసులనురాజీమార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి, అదనపు జిల్లా జడ్జి కె. లావణ్య బాలరెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి. కలర్చన, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. కవిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీపా కాసరగడ్డ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


