POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 9:49 pm Posted by : POLITICAL POWER

రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన ప్రవీణ్ చక్రవర్తికి ఏఐపీసీ తెలంగాణ నాయకుల అభినందనలు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 05 2026: ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన ఏఐపీసీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ని చెన్నైలోని ఆయన నివాసంలో శుక్రవారం రోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐపీసీ తెలంగాణ సిఏ హెడ్ సుబ్బారావు ఉన్నం మరియు ఏఐపీసీ మేడ్చల్-మల్కాజిగిరి అధ్యక్షుడు, టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నరేన్ రాజా ఎ. కూడా పాల్గొన్నారు. రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల ప్రవీణ్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన నాయకులు, ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరగగా, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.