కలసపాడు సెప్టెంబర్ 23 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండల పరిధిలోని చిత్తా మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ, నియోజకవర్గ యువ నాయకుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ వివిధ కమిటీలలో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, గుర్తింపు కార్డులను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ సుధ, దేవసాని ఆదిత్య రెడ్డి చేతుల మీదుగా అందజేశారు అలాగే. పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు గుర్తింపు కార్డులు అందించడం ద్వారా, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని నాయకులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, నాయకులు, కార్యకర్తలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి ప్రధాన బలమని, ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ విధానాలను, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలసపాడు మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్, మాజీ జెడ్పీటీసీ, గురివి రెడ్డి, మాజీ ఎంపీపీ నిర్మల, పార్టీ సీనియర్ నాయకులు సుధా రామకృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, నారాయణ, చిత్తా రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండలాల అనుబంధ విభాగాల నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*