POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 11:17 am Posted by : POLITICAL POWER

రాష్ట్రంలో కొత్త పోలీస్ మాన్యువల్, సైబర్ క్రైమ్, డ్రగ్స్, ఆహార కల్తీ ట్రాఫిక్ పై ఉక్కు పాదం

 – తెలంగాణ పోలీస్ లో నూతన వరవడి వందరోజుల పాలనలో సరికొత్త ఆలోచనలు తెలంగాణ డిజిపి సివి ఆనంద్ ,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ఆగస్టు10.2026.

తెలంగాణ పోలీస్ శాఖలో నూతన కొత్త ఒరవడి తీసుకురావడమే లక్ష్యంగా శాంతిభద్రతలు ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత పోలీసింగ్ వ్యవస్థ కోసం పెద్దపీట వేయడానికి ఇటీవల తెలంగాణ నూతన డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ 100 రోజుల పరిపాలనపై సరికొత్త ఆలోచనలతో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తేవడమే కాకుండా కొత్త పోలీస్ మాన్యువల్ ప్రవేశపెట్టడానికి కంకణం కట్టుకున్నారు. సీనియర్ పోలీస్ ఐపీఎస్ అధికారిగా 2026 మే 1న తెలంగాణ డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ 1999 పోలీస్ బ్యాచ్కు చెందిన సిబి ఆనంద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు ఆ తర్వాత హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సివి ఆనంద్ ఇటీవల అనేక కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఆర్టిఫిషియల్(ఏ 1) తో కూడిన డయల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ప్రవేశపెట్టారు గతంలో ఎమర్జెన్సీ డయల్100 స్థానంలో 112 ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా 18 రకాల సేవలు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న సైబర్ క్రైమ్ నేరాలను కూకటి వేళ్ళతో తొలగించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థలో సమూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ తో పాటు మానవ జీవితాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ మాదకద్రవ్యాల విక్రయాల పై కూడా ఉక్కు పాదం మోపుతున్నారు. డ్రగ్స్ విక్రయాలు రాబోయే 15 ఏళ్లకు అనుగుణంగా పోలీసింగ్ లో ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తూ డ్రగ్స్ మహమారి నుంచి ప్రజలను రక్షించడానికి ప్రత్యేక కార్యచరణ కార్యక్రమం రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో గంజాయి నేరాలు అదుపు చేయడానికి ప్రధాన కర్తవ్యం గా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్రేగిపోతున్న ప్రధాన సమస్యలలో డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నేరాలు ట్రాఫిక్ సమస్యను నియంత్రించే అత్యంత ప్రాధాన్యత కలిగిన తెలంగాణ పోలీస్ మ్యానువల్ ఆవిష్కరణ త్వరలో ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 93 వేల మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తున్న పోలీస్ శాఖలో శాంతి భద్రతల విషయంలో సీరియస్ గా పోలీస్ వ్యవస్థ పని చేసే విధంగా రాష్ట్ర డిజిపి సి వి ఆనంద్ నిర్ణయాలు తీసుకోవడం విశేషం. అంతేకాక దేశంలోనే సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఈ నేరాలు అరికట్టేందుకు టిజిసిఎస్ బి సురక్ష కా తిరంగా-సైబర్ నేర రహిత దిశగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతినెల బుధవారం జాతీయ సైబర్ క్రైమ్ అవగాహన దినోత్సవాల లో భాగంగా రాష్ట్రంలో కూడా నెల రోజులపాటు సైబర్ క్రైమ్ నేలలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు సదస్సులను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం గొప్ప విశేషం. సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్ నియంత్రణ ట్రాఫిక్ సమస్యతో పాటు అతి ముఖ్యంగా రాష్ట్రంలో ఆహార కల్తీ నీ అరికట్టడానికి డిజిపి సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కల్తీ ఆహార విక్రయాల నివారణ కోసం ప్రత్యేక ఇన్ఫోసిమెంట్ విభాగం ఏర్పాటు చేసి రాష్ట్రంలో కల్తీ లేని ఆహారం ప్రజలకు అందించడం లక్ష్యంగా పోలీస్ శాఖ తో పాటు ఆహార భద్రత అధికారుల తో కూడిన బృందం రాష్ట్రంలో తనిఖీలు నిర్వహిస్తుందని ఎక్కడ కూడా కల్తీ ఆహార పదార్థాలు విక్రయించకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కల్తీ ఆహారంతో ప్రజల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయనిఅందుకోసమే కల్తీ పై కూమింగు ఆహార కల్తి ముఠాలపై ప్రత్యేక నిఘ పెట్టి కల్తీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ పోలీస్ బాస్ సీవీ ఆనంద్ కంకణం కట్టుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లో వినూత్న మార్పులు తీసుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రజలుడిజిపిపనితీరుపైప్రశంసలవర్షంకురిపిస్తున్నారు. డయల్ 112 ఎమర్జెన్సీ తో పాటు కల్తీ ఆహారం డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నేరాలు ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రధాన అంశాలుగా తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజలకు శాంతి భద్రతల విషయం తో పాటు ప్రజలు అన్యాయంగా మోసాలకుగురికాకుండా కొత్తకొత్తఆలోచనలతోముందుకుసాగడంఅభినందనీయం. అంతేగాక రాష్ట్రంలోని పోలీస్ అధికారులను సిబ్బందిని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాల ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా పోలీస్ వ్యవస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిజిపి రాష్ట్ర పోలీస్ సిబ్బందికి సూచనలు సలహాలు ఇస్తున్నారు.