పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 11 2026: ఈనెల 4వ తేదీన ఇండియన్ పబ్లిక్ స్కూల్, సుల్తానాబాద్ పాఠశాల ఆవరణలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ముబస్సిర్ ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్ జి.ఎస్.ఎం టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగే రాష్ట్ర స్థాయికి పోటీలకు ఎంపికైనట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు తగురం తిరుపతి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సయీద్ అహ్మద్ మరియు ప్రధానోపాధ్యాయులు హకీమ్ ఖాన్ విద్యార్థిని అభినందించారు.