విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 12 2026: పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లకు చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రీవల్లి రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఇటీవల వనపర్తి జిల్లాలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు కామారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వనపర్తి జిల్లా జట్టు గురువారం కామారెడ్డికి బయలుదేరింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని శ్రీవల్లిని అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు, ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, వాణిప్రభ, పుల్లయ్య, కె. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, వ్యాయామ ఉపాధ్యాయులు, వి. మధుసూదన్, కృష్ణవేణి, చిన్నారెడ్డి, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.