POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 2:30 pm Posted by : POLITICAL POWER

రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటిన వనపర్తి స్కాలర్స్ కాలేజ్ విద్యార్థులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి వనపర్తి స్కాలర్స్ కాలేజ్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బైపీసీ విభాగానికి చెందిన చావ భవ్యశ్రీ 438 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, డి. పల్లవి 437 మార్కులతో 4వ ర్యాంక్ సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు పట్టుదలతో చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే ఈ విజయాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ఉంగ్లం తిరుమల్, ప్రేమ్ నాథ్ రెడ్డి, నరసింహ, చిట్యాల రాము, ఎండీ అలీమ్, ఆర్. చంద్రశేఖర్, సేనాపతి, నిరంజన్, వంశీ, యది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఈ విశిష్ట విజయంపై కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.