POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 5:51 pm Posted by : POLITICAL POWER

రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంపై ప్రశంసలు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 19 2026: ఇతని ముత్తాత ఆగర్భ శ్రీమంతుడు అయినా కూడా స్వదేశీ ఉద్యమం కోసం తన బీరువాలలో గుట్టలుగా ఉన్న విదేశీ వస్త్రాలను అలహాబాద్ వీధుల్లోకి తెచ్చి మంటల్లో వేసేశాడు. స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని, భారత జైళ్లలో అక్షరాలా 3,259 రోజులపాటు చీకటి జీవితం గడిపి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ సర్వతోముఖ అభివృద్ధికి బాటలు పరిచాడు. అతని నాయనమ్మ భారత హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలను కాదని, కేవలం సెక్యులరిజం పాటించడం కోసం స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత సిక్కు మతస్తులు తనపై కత్తి కట్టారని తెలిసినా కూడా తన అంగరక్షకుల్లోని సిక్కులను తొలగించకుండా, వారి తుపాకీ గుళ్లకు ఒళ్లంతా జల్లెడపట్టి నేలకొరిగిపోయింది. అతని తండ్రి భారత దుర్మార్గపు జర్నలిజానికి బలైపోయి పదవిని కోల్పోయాక, తమిళ తీవ్రవాదుల ఆత్మాహుతి దళాలకు శరీరం తుత్తునియలు అయిపోయి నేలకొరిగిపోయాడు. అతని తల్లి తాను జన్మతః విదేశీయురాలని, తాను ప్రధాని పదవిని చేపడితే స్థానికుల మనోభావాలు దెబ్బతింటాయేమోననే కారణంతో ఒకటి కాదు, మూడుసార్లు ఆ పదవిని త్యజించింది. అతను కూడా ఒకటికి రెండుసార్లు అవకాశం వచ్చినా, తనకు ఇంకా వయసు రాలేదనే ఉద్దేశంతో ఆ పదవిని ఇతరులకు వదిలేశాడు. వరుసగా ఐదోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బ్రిటిష్ వారి బూట్లు నాకిన వారికి ఏం తెలుసు ఈ రాహుల్ గాంధీ విలువ అని పలువురు వ్యాఖ్యానించారు.