POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 8:34 pm Posted by : POLITICAL POWER

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కారు అబ్రహం కు ఘన నివాళి….

పొలిటికల్ పవర్ పిన్ 9 టివి జాతీయ దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు మండలం, కడప జిల్లా జులై 04 2026: బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు కు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కారు, అబ్రహం(82) కు శనివారం పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. గురు శ్రీ కారు అబ్రహం సి.ఎస్.ఐ చర్చి ఆవరణలోని ఎస్పీజీ ప్రాథమికోన్నత పాఠశాలలో 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అంతేగాకుండా పరి పేతురు, పరిశుద్ధ పౌల్ చర్చి నందు కార్యదర్శిగా మరియు వివిధ విభాగాలలో ఉన్నత పదవుల్లో కొనసాగి చర్చి అభివృద్ధికి కృషి చేశారు. ఆయన శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతదేహాం ను కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కలసపాడు మాజీ సర్పంచ్, నాగరాజ, నారాయణ, ఎగువ రామాపురం మాజీ సర్పంచ్, బాల అంకిరెడ్డి(బాలుడు )మండల టిడిపి యువ నాయకులు, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఎస్టీయు ఉపాధ్యాయు సంఘ జాతీయ నాయకులు పిల్లి రమణారెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, మాదన విజయకుమార్, జిల్లా కార్యదర్శులు కుర్రా చెన్నయ్య, కె.జోజయ్య, నాయకులు విజయభాస్కర్, భాస్కర్ రెడ్డి, ఈశ్వరరావు, సెబాస్టియన్, కృష్ణయ్య, చిత్త, రాజశేఖర్ రెడ్డి, ప్రభావతి, ప్రవీణ్ మిత్రులు, సీఎస్ఐ చర్చి కమిటీ వారు, గురువులు రెవ.ఆశిస్ గాబ్రియల్, రెవ.జాన్సన్ బాబు, రెవ.కోలాట రాజు, కలసపాడు ఎంఈఓ మస్తాన్ వలి, సత్యనారాయణ, బి.ఎన్.ప్రసాద్, కాశీం వలి, డి.ఎల్.చంద్రశేఖర్, బాలరాజు, జయరామి రెడ్డి, పుల్లయ్య, గురు ప్రసాద్, ఖాజా, కారు లాజరస్, వరదరాజులు, రామతీర్థం, తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం అంత్యక్రియలు… కారు అబ్రహం అంత్యక్రియలు కలసపాడు లో ఆదివారం నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు ఉపాధ్యాయుడు కారు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం అంతిమ యాత్ర ప్రారంభమై కలసపాడు టౌన్ చర్చ్ ఆవరణలోని సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు అంత్యక్రియల కార్యక్రమానికి నంద్యాల అధ్యక్ష ఖండపు పీఠాధిపతులు ది.రైట్.రెవ. కామనూరి సంతోష్ ప్రసన్న రావు హాజరవుతారని తెలిపారు.