కాశి నాయన మండల సర్వేయర్ స్వాతి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ జాతీయ సమగ్ర దినపత్రిక రిపోర్టర్. ఎం .ప్రసాద్ రావు కాశినాయన మండలo. కడప జిల్లా: బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం కత్తెర గండ్ల రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే మొదలవుతుందని సోమవారం రీ సర్వే పై అవగాహన ర్యాలీ మరియు గ్రామసభలు ఏర్పాటు చేశారు కాశినాయన మండల తాసిల్దార్ ఆదేశాల మేరకు కాశినాయన మండల సర్వేయర్ స్వాతి ఆధ్వర్యంలో కత్తెర గండ్ల రెవెన్యూ గ్రామాలలో 6వ విడత ప్రారంభం కానుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మండల సర్వేయర్ స్వాతి మాట్లాడుతూ… 6 విడత రి సర్వేలో భాగంగా చెన్నవరం, రెడ్డి కొట్టాల, బాలరాజు పల్లె, కొండపేట, ఆకుల నారాయణపల్లె, కోడిగుడ్లపాడు, బసనపల్లె, ఆనం వారి పల్లె, కొండరాజు పల్లె, నల్లేరు కొట్టాల గ్రామాలకు రి సర్వే ఆగస్టు 4 నుండి మొదలవుతుందని ఈ సర్వే జరిగే సర్వే నెంబర్లకు ముందుగా రైతులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని భూమి సమస్యలు ఏమైనా ఉన్నా మా దృష్టికి తేవాలని ప్రతి ఒక్క రైతు భూమికి ఎల్ పి ఎం నెంబర్ ఇవ్వడం జరుగుతుందని అక్కడే కొలతలు వేసి అక్కడికక్కడే చెప్పడం జరుగుతుందని సమస్యలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే రీ సర్వే జరుగుతుందని దీనిని ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి పొలాలకు హద్దులు చూపించుకొని సరైన ఆధారాలతో రీ సర్వే దగ్గరికి వచ్చి సర్వేకు సహకరించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఆకుల నారాయణపల్లె పంచాయతీ సెక్రెటరీ ప్రతాప్ యాదవ్ వీఆర్వోలు ఏవి నాయక్, భాష, సర్వేర్లు నరసింహ, గురు ప్రవీణ్, నాగమణి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.