POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 9:34 am Posted by : POLITICAL POWER

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..

– విఠలేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 25 జూలై 2026.

రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు భక్తులు తొలి ఏకాదశి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సమేత విఠలేశ్వర స్వామికి ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా తమపై ఉండాలని, స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కులకర్ణి రామారావు శర్మ, కమిటీ సభ్యులు చిదుర వీరేశం గుప్త, గెంటిల సాయిలు,తాటిపాముల విజయ్, బెజుగం వెంకటేశం గుప్త, ఇందూరు చంద్రశేఖర్, పార్వతి మురళి, చింతల నరేందర్ మరియు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.