POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:07 pm Posted by : POLITICAL POWER

రూ.3.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ఏదులలో తహసీల్దార్ భవనం

విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రేవల్లిలో ఆధునిక ఎక్స్‌రే యూనిట్ ప్రారంభం

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

-ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: వనపర్తి నియోజకవర్గంలోని ఏదుల మండల కేంద్రంలో శనివారం వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి రూ.3.40 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయ భవన సముదాయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ భవనం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం రూ.65 లక్షల వ్యయంతో గ్రామానికి ఏర్పాటు చేస్తున్న ఆల్టర్నేట్ విద్యుత్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.24 లక్షలతో చేపట్టిన విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రేవల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రూ.18 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అత్యాధునిక ఎక్స్‌రే యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పారదర్శక పాలనతో ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్, వైద్యం, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు సత్యశీలారెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి విటోబా, సింగిల్ విండో అధ్యక్షులు రఘు, మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ పరుశురాం, రాష్ట్ర ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి కొంకి వెంకటేష్, ఏదుల మండలం ఇంచార్జ్ కోళ్ల వెంకటేష్, నాయకులు పర్వతాలు, జమ్మి మల్లేష్, జానకి రాములు, ఆయన మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు, పెద్దలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.