POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:55 am Posted by : POLITICAL POWER

రెండు తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డప్పు రాజు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 29 2026: టాన్‌చెరు, తెలంగాణ: రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ఆడపడుచులు, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డప్పు రాజు హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన కుటుంబ సభ్యులు, అక్కచెల్లెమ్మలతో కలిసి రాఖీలు కట్టించుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డప్పు రాజు మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, రక్షణకు ప్రతీకగా నిలిచే అపురూపమైన పండుగ అని అన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలను మరింత బలపరిచే పవిత్రమైన బంధమే రాఖీ అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సోదర సోదరీమణుల మధ్య సంతోషం, ఐక్యత, పరస్పర గౌరవం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.