POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 12:03 pm Posted by : POLITICAL POWER

రెండు పార్టీల చూపు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే….!!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్రా నాగరాజు రెడ్డి 2029ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్,బీజేపీలు రెండూ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం వైసీపీ పార్టీపైనే ఆధారపడాలన్న వ్యూహాలతో ముందుకు వెళుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి! ఏ టైంకి ఎవరితో జతకడతాడో తెలియని చంద్రబాబును ఎంతమాత్రం విశ్వసించలేమన్నది వారి ఆలోచనగా స్పష్టమవుతుంది!2025లోనే మైనారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, 2029ఎన్నికల్లో మెజారిటీపై కన్నేసి అన్నిరాష్ట్రాల్లో తమవ్యూహాలకు పదును పెడుతుంది! ఇక కాంగ్రెస్ కూడా ఈసారైనా మిత్రపక్షాల సహకారంతో గద్దెక్కవచ్చని,అధికరాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ‘యాంటి ఇన్కమ్బెన్సీ’ వల్ల ఎంపీ సీట్లు కోల్పోయే అవకాశం ఉందని భావిస్తుంది! అయితే ఉత్తర,దక్షిణాలైన బీజేపీ,కాంగివ్యూహాల్లో దక్షిణాదివరకూ మాత్రం మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిని తమమిత్రుడిగా ఉంచుకోవాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. అందుకే షర్మిలకి రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చికూడా,ఈ చర్య వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రాపు ఇక ఎప్పటికి సంపాదించలేమన్న కారణంగా చివరి నిముషంలో అక్కయ్యకి పార్టి జెల్ల కొట్టింది! ఇక బీజేపీ కూడా టీడీపీ అధ్యక్షుణితో ఉన్న గత అనుభవాలరీత్యా అతగాడిని ఎంతమాత్రం నమ్మక పోగా, 2029లో కాంగి, బీజేపీలకు బరాబర్ సీట్లు వస్తే, బాబు కాంగి వైపు మొగ్గడానికే సిద్ధపడతాడన్న ఉద్దేశ్యంతో, జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తేనే విశ్వసనీయత కలిగిన అతడి సహకారం సంపూర్ణంగా తమకు లభిస్తుందని భావిస్తున్న విషయం ఇటీవల పవన్,నాదెండ్ల – అమిత్ షా ల మీటింగుంతో బహిర్గతo అయ్యింది! ఈ విధంగా రానున్న రోజుల్లో కేంద్ర రాజకీయాల పరంగా చంద్రబాబుకు గడ్డురోజులు కాగా, విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మాజీ సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నీ మంచి రోజులుగానే కానవస్తున్నాయి!!