POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 7:18 pm Posted by : POLITICAL POWER

రెండ వ విడత ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ 


ఎన్నోసంవత్సరాలుగాపూరిగుడిసెల్లో,కిరాయిల్లో ఉండి ఎంతో ఇబ్బంది పడ్డము,
– లబ్ధిదారులు రషీద ముక్రం, సిరివాటి సుజాత అంజి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 23.2026.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సహకారంతో దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి కృషితో ఆరో వార్డు కౌన్సిలర్ జె. అఖిల తండ్రి సుభాష్ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని  లబ్ధిదారులు రషీద ముక్రం, సిరివాటి సుజాత అంజి  హర్షం వ్యక్తం చేశారు.సోమవారం కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో రెండ వ విడత ఇందిరమ్మ ఇండ్లకుభూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటి లబ్ధిదారులు రషీద ముక్రం, సిరివాటి సుజాత అంజి  మాట్లాడుతూ రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా పూరిగుడిసెల్లో కిరాయిల్లో ఉండి ఎంతో ఇబ్బంది పడ్డమనీ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సహకారంతో దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని  లబ్ధిదారులు రషీద ముక్రం, సిరివాటి సుజాత అంజి  హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, ఆరో వార్డు కౌన్సిలర్ జె. అఖిల తండ్రి సుభాష్, కౌన్సిలర్లు ఎన్ జె.  బోయేజ్, భీమ చంద్రకాంత్ కరాటే నభి, కో ఆప్షన్ సభ్యులు కొండారెడ్డి, తయ్యబ్,హాఫిజ్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ రెడ్డి, బాలరాజ్, తదితరులు  పాల్గొన్నారు.