POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 11:22 pm Posted by : POLITICAL POWER

రేపు కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని కాశినాయన తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయండి.

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 తెలుగు న్యూస్ రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్నియోజకవర్గంలోని కాశినాయన మండలం భూమిలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం మిద్దెల గ్రామంలో సామాజిక శంఖారావం పేరుతో కరపత్రాలు వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ… కాశినాయన మండలం పరిధిలో అక్కింగుండ్ల నాయన పల్లె మూలపల్లె సావిశెట్టిపల్లె ఇటుకలపాడు రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు దళితులకు ఒక సెంటు భూమి ఇవ్వలేదు ధనవంతులకు రాజకీయ పలుకుబడి కలిగిన వారికి ప్రభుత్వ భూములు అప్పన్నంగా రెవెన్యూ అధికారులు అప్పజెప్పారు అన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఆర్డిఓ చంద్రమోహన్ భూకబ్జాదాల వద్ద ఉన్న భూములపై విచారణ చేపడతాం అని కాలయాపన చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకున్నది. ఒక ఎకరం భూకబ్జాదాల నుంచి భూములు స్వాధీనం చేసుకోలేకపోయినారన్నారు. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘం, కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈనెల మూడో తేదీ సోమవారం నర్సాపురం తాహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల్ నాయకులు ఓబులాపురం ఓబయ్య , వై సుమన్, ఎన్ ఓబయ్య, చిన్నరామయ్య ,వై పోలయ్య, వై సంతోష్, చిన్నబాబు, డి వీరయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.