POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 6:27 pm Posted by : POLITICAL POWER

రేవల్లి మండలంలో ఘనంగా పాఠశాల క్రీడా పోటీలు

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌లో విద్యార్థుల ఉత్సాహభరిత పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: రేవల్లి మండలంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు శనివారం ఘనంగా నిర్వహించారు. రేవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు రేవల్లి గ్రామ సర్పంచ్ రాజయ్య, మండల అభివృద్ధి అధికారిణి కుమారి కీర్తన, మండల విద్యాధికారి ఎస్. వరప్రసాద్ రావు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాద్, జిల్లా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రామమూర్తి తదితరులు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు రేవల్లి మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు సహకరించారు. ఉదయం ప్రారంభమైన పోటీలు సాయంత్రం వరకు నిర్విరామంగా కొనసాగాయి. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి కుమార్, మండల అభివృద్ధి అధికారిణి కుమారి కీర్తన పాల్గొని వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

విజేతల వివరాలు

కబడ్డీ – బాలికలు మొదటి స్థానం – కేజీబీవీ రేవల్లి రెండో స్థానం – జడ్పీహెచ్ఎస్ రేవల్లి

కబడ్డీ – బాలురు మొదటి స్థానం – జడ్పీహెచ్ఎస్ రేవల్లి రెండో స్థానం – జడ్పీహెచ్ఎస్ నాగపూర్

ఖోఖో – బాలికలు మొదటి స్థానం – జడ్పీహెచ్ఎస్ నాగపూర్ రెండో స్థానం – జడ్పీహెచ్ఎస్ రేవల్లి

ఖోఖో – బాలురు మొదటి స్థానం – జడ్పీహెచ్ఎస్ నాగపూర్ రెండో స్థానం – జడ్పీహెచ్ఎస్ తలుపునూరు

వాలీబాల్ – బాలురు మొదటి స్థానం – జడ్పీహెచ్ఎస్ రేవల్లి రెండో స్థానం – జడ్పీహెచ్ఎస్ తలుపునూరు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు, అధికారులు అభినందించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.