రేవల్లి మండలంలో ఘనంగా పాఠశాల క్రీడా పోటీలు

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌లో విద్యార్థుల ఉత్సాహభరిత పోటీలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: రేవల్లి మండలంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు శనివారం ఘనంగా నిర్వహించారు. రేవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 10...