*రైతాంగానికి జీవనాధారం అందించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్*
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే15: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని కెనాల్ రోడ్డులో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా గ్రామ పెద్దలు, రైతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ సబ్బేళ్ళ గంగరాజు మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ రైతాంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ద్వారా గోదావరి నదీ జలాలను...