రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
రైతుబంధులో జాప్యం.. వరి కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై పెద్దమందడిలో బీఆర్ఎస్ నేతల ఆగ్రహం పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతాంగాన్ని మోసం చేస్తూ కాలయాపన విధానాలను అనుసరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుబంధు నిధుల విడుదలలో జాప్యం చేయడంతో పాటు వరి కొనుగోళ్లను సక్రమంగా నిర్వహించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతాంగ...