POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 10:30 pm Posted by : POLITICAL POWER

రైతులకు మరింత చేరువగా సహకార బ్యాంకింగ్ : మంత్రులు పొంగులేటి, తుమ్మల

– కరుణగిరి, చెరువు మాదారం నూతన డీసీసీబీ శాఖల ప్రారంభం

– రూ. 20 వేల కోట్ల రుణమాఫీతో రైతులకు అండగా నిలిచాం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిది ​ఖమ్మం: రైతులు, స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కరుణగిరి డిసిసిబి బ్రాంచిని వరంగల్ క్రాస్ రోడ్డులో, నేలకొండపల్లి మండలం చెరువు మాదారం డిసిసిబి బ్రాంచిని చెరువు మాదారం గ్రామంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., సీపీ సునీల్ దత్‌లతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…ప్రైవేట్, కమర్షియల్ బ్యాంకులతో పోటీగా డీసీసీబీ శాఖలు ఆధునిక ఆర్థిక సేవలు అందిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం డీసీసీబీ రూ. 5 కోట్ల లాభాలను ఆర్జించిందని కలెక్టర్ పేర్కొన్నారు.