POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 7:15 am Posted by : POLITICAL POWER

రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే మట్టా రాగమయి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

బీఎల్‌ఓలు పాటించాల్సిన విధానాలు, బాధ్యతలపై డీసీసీ అధ్యక్షుడు నూతి అవగాహన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ… ఈ నెల 30న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్‌ఓలు పాటించాల్సిన విధానాలు, బాధ్యతలపై వివరంగా మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ పోస్టర్ ను ఎమ్మెల్యే మట్ట రాగమయి, డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఏఎంసీ చైర్మన్, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మండల మరియు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.