రైతు గోస – బీజేపీ భరోసా బస్సు యాత్రలో రైతులకు అండగా నిలిచిన బీజేపీ నాయకులు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 06 2026: భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన “రైతు గోస – బీజేపీ భరోసా” బస్సు యాత్ర కార్యక్రమంలో రైతుల సమస్యలను బీజేపీ నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. గత నెల రోజులుగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. తమ కష్టార్జిత పంట వర్షానికి...