పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: 30 మందికి గాను 10 మంది వనపర్తి ప్రతినిధులకు అవకాశం రైతుల సమస్యలు, సూచనలు, అవసరాలను నేరుగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ATMA ఆధ్వర్యంలో జిల్లా రైతుల సలహా కమిటీ (DFAC) ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చైర్మన్‌గా, పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామ మాజీ సర్పంచ్ విట్ట సూర్యచంద్రారెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో కమిటీలోని 30 మంది కి గాను వనపర్తి నియోజకవర్గానికి చెందిన 10 మంది రైతులకు ఈ కమిటీలో అవకాశం లభించడం హర్షించదగ్గ విషయం
కమిటీ సభ్యులు
1. విట్ట సూర్యచంద్రారెడ్డి – వైస్ చైర్మన్ చిన్నమందడి 2. ఇటిక్యాల ప్రవీణ్ కుమార్ రెడ్డి – సభ్యులు పెద్దమందడి 3. కార్పునొల్ల ప్రభాకర్ రెడ్డి – సభ్యులు ఖిల్లా ఘణపురం 4. రాగనమోని మల్లేష్ – సభ్యులు ఖిల్లా ఘణపురం 5. కొతకాపు చంద్రశేఖర్ రెడ్డి – సభ్యులు వనపర్తి 6. కొత్తసమర సింహారెడ్డి – సభ్యులు వనపర్తి 7. పుల్లూరు నీలవ్ రెడ్డి – సభ్యులు పెబ్బేరు 8. వడ్డెమాన్ నాగన్న – సభ్యులు గోపాల్ పేట 9. గంట వెంకట్ రెడ్డి – సభ్యులు గోపాల్ పేట 10. కటమోని రమేష్ – సభ్యులు ఏదుల రైతుల సమస్యలు, పంటల సాగు, మార్కెటింగ్, వ్యవసాయ పథకాలు తదితర అంశాలపై రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు పేర్కొన్నారు. వనపర్తి రైతుల సంక్షేమానికి ఈ కమిటీ ఎంతో ఉపయోగకరంగా నిలవనుందన్నారు. ఈ సందర్భంగా కమిటీ వైస్ చైర్మన్ సూర్యచంద్రారెడ్డికి, మరియు సభ్యులందరికీ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అభినందనలు తెలియజేశారు.