POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 4:04 pm Posted by : POLITICAL POWER

రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ 

 – మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి , 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 10. 2026.

వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం కు సంబంధించిన చెక్కులను మహబూబ్ నగర్ ఎంపీ  డికె. అరుణ తో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతుకు భూమి కేవలం ఆస్తి కాదని, అది వారి జీవనాధారం, కుటుంబ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుందని అన్నారు.రైల్వే డబుల్ లైన్ కోసం భూములు కోల్పోతున్నరైతులత్యాగాన్నిప్రభుత్వంగుర్తించుకుంటుందని పేర్కొన్నారు.మన ప్రాంతంలో 80–85 శాతం మంది సన్నకారు, చిన్నకారు రైతులేనని, చాలా మంది రైతులకు అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాలు, మూడు ఎకరాల వరకు మాత్రమే భూమిఉంటుందని, దానిని కోల్పోవడం ఎంత బాధాకరమో మనం అర్థం చేసుకోవాలని అన్నారు.రైల్వే డబుల్ లైన్ వంటి ప్రజా అవసరాల కోసం భూసేకరణ చేయాల్సినపరిస్థితులు వచ్చినప్పుడు,భూములుకోల్పోయేరైతులకున్యాయమైన పరిహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే జియంఆర్  స్పష్టం చేశారు.ఏడు గ్రామాల పరిధిలో రైల్వే డబుల్ లైన్ కోసం సుమారు 23 ఎకరాల 25 గుంటల భూమిని రైల్వే, రెవెన్యూ అధికారులు భూసేకరణ ప్రక్రియ ద్వారాసేకరించారని, ఈ ప్రక్రియలో అనేక మంది సన్నకారు, చిన్నకారు రైతులు తమ భూములను కోల్పోయారని, వారికి పరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.ప్రజా ప్రయోజనం కోసం తమ భూమిపోయినాపర్వాలేదు.రైల్వేడబుల్,లైన్,వస్తేమనప్రాంతానికిఎంతోఉపయోగపడుతుందని, ప్రజలకు రవాణా సౌకర్యం పెరుగుతుందని, మన ప్రాంతం అభివృద్ధిచెందుతుంది.అనేగొప్పఆలోచనతోరైతులుముందుకురావడంఅభినందనీయమన్నారు.ప్రస్తుత భూమి విలువలతో పోలిస్తే ప్రభుత్వం నిబంధనల ప్రకారం అందిస్తున్న పరిహారం సరిపోదన్న రైతుల ఆవేదననుతానుకూడాఅర్థంచేసుకుంటున్నానని,రైతులకుపరిహారంపెంచేమార్గాలపైకలెక్టర్‌తోచర్చిస్తాననితెలియజేశారు.భూసేకరణకు సంబంధించిన కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ పరిధిలో ఉంటాయని రైతులకు పరిహారం పెంచే మార్గాలపై ఎంపీరైల్వే,కేంద్రఅధికారులతోనూమాట్లాడాలనిసూచించారు.అదేవిధంగా మదనపురం రైల్వే గేట్ వద్ద మదనపురం కొత్తకోట ఆత్మకూరు మండలాల ప్రజలు తీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారని,రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఈ రోడ్డును డబుల్ లైన్ నిర్మాణానికి ఆర్ అండ్ బి  శాఖ మంత్రివర్యులు శంకుస్థాపన చేశారని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇక్కడఆర్ఓబిమంజూరు చేయించాలని ఎంపీ ని ఎమ్మెల్యే జియంఆర్ కోరారు.ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.