రోడ్డుపై గాజు ముక్కలు.. సర్పంచ్ స్పాట్ యాక్షన్

ప్రజల భద్రతకు తక్షణ చర్యలు.. రోడ్డును శుభ్రం చేయించిన రమాదేవి రాంబాబు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 03: మండల కేంద్రంలోని ఎయిర్‌టెల్ టవర్‌ సమీపం నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తులు గాజు సీసాలను పగలగొట్టి రోడ్డుపై పడేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న గాజు ముక్కల కారణంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు వెంటనే స్పందించి సంఘటనా...